AP News: వినాయకుడు లడ్డు పాట వేలం డబ్బుతో రోడ్డు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-09-17T20:08:46+05:30 IST

గుంతల రోడ్లతో ఇబ్బందులు పడలేక జిల్లాలోని కలిదిండి మండలం తాడినాడ గ్రామస్థులు ముందడుగు వేశారు.

AP News: వినాయకుడు లడ్డు పాట వేలం డబ్బుతో రోడ్డు మరమ్మతులు

ఏలూరు: గుంతల రోడ్లతో ఇబ్బందులు పడలేక జిల్లాలోని కలిదిండి మండలం తాడినాడ గ్రామస్థులు ముందడుగు వేశారు. వినాయకుడి లడ్డు పాట వేలం డబ్బుతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. స్కూల్‌కి వెళ్లే విద్యార్థులు,  వాహనదారులు పడుతున్న ఇబ్బందులు చూడలేక స్వచ్ఛందంగా మరమ్మతులు చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. వినాయకచవితి ఉత్సవాలు పురస్కరించుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన మండపాల్లో వచ్చిన విరాళాలు, లడ్డు పాట వేలం రూ.2 లక్షల 50 వేలతో తాడినాడలో మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ప్రభుత్వం రోడ్డు మంజూరు చేశామని చెప్పినప్పటికీ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. 


Read more