ఆర్టీసీలో నగదు రహిత సేవలు : ఆర్‌ఎం

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యను అధిగమించేందుకు నగదు రహిత సేవ లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పీటీడీ ఆర్‌ఎం ఎన్‌విఆర్‌ వరప్రసాద్‌ తెలిపారు.

ఆర్టీసీలో నగదు రహిత సేవలు : ఆర్‌ఎం
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యను అధిగమించేందుకు నగదు రహిత సేవ లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పీటీడీ ఆర్‌ఎం ఎన్‌విఆర్‌ వరప్రసాద్‌ తెలిపారు.

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 8 : ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యను అధిగమించేందుకు నగదు రహిత సేవ లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పీటీడీ ఆర్‌ఎం ఎన్‌విఆర్‌ వరప్రసాద్‌ తెలిపారు. ఆయన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇ–మిషన్‌ ద్వా రా నగదు రహిత టిక్కెట్‌ పొందే సౌకర్యం ప్రయా ణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రయాణీకులు ఏదైనా ఫోన్‌ ద్వారా, ఏటీఎం, ఫోను ద్వారా క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి నగదు రహితంగా బస్సు టిక్కెట్‌ తీసుకోవచ్చున న్నారు. ఈ విధానం డ్రైవర్ల వద్ద అందుబాటులో ఉందని కొద్ది రోజుల్లో కండక్టర్లకు ఇస్తామన్నారు. 


Updated Date - 2022-09-08T05:30:00+05:30 IST