చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.36 కోట్లు

ABN , First Publish Date - 2022-11-17T00:11:33+05:30 IST

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.36 కోట్లు

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.2.36 కోట్లు
హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహిస్తున్న సిబ్బంది

ద్వారకాతిరుమల, నవంబరు 16 : ద్వారకాతిరుమల వేంక టేశ్వరస్వామికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 20 రోజుల కాలానికి నగదు రూపేణా రూ.2.36 కోట్ల్ల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాఽథరావు తెలిపారు. ప్రమోద కల్యాణమండప ఆవరణలో బుధవారం అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ లెక్కింపు నిర్వహించారు. నగదుతో పాటు భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 316 గ్రాముల బంగారం, 5.780 కేజీల వెండి లభించినట్లు తెలిపారు. రద్దయిన పాత రూ.500 నోట్లు (105) రూ.వెయ్యి నోట్లు (8)తో పాటు విదేశీ కరెన్సీ సైతం లభించింది.

శ్రీవారి సాయంకాలార్చన సమయంలో మార్పు

శీతాకాలం ప్రారంభం కావడంతో ఈనెల 19 నుంచి శ్రీవారి సాయంకాలార్చన సమయాన్ని మార్పు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. సాఽధారణంగా ప్రతీరోజూ సాయంత్రం 5–30 గంటల నుంచి 7 గంటల వరకూ చినవెంకన్నకు సూర్యాస్తమయాన్ని అనుసరించి సాయంకాలార్చన నిర్వహిస్తారు. దీన్ని మేష సంక్ర మణం వరకూ సాయంత్రం 5 గంటల నుంచి 6–30 గంటలకు మార్పు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-11-17T00:12:18+05:30 IST