-
-
Home » Andhra Pradesh » West Godavari » driver died in road accident-MRGS-AndhraPradesh
-
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం
ABN , First Publish Date - 2022-08-15T05:30:00+05:30 IST
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు.

భీమడోలు ఆగస్టు 15: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. భీమడోలు పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా యండపల్లి గ్రామానికి చెందిన వీర్రాజు (35) మూడేళ్ళుగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అడబాల గంగాధరరావుకు చెందిన మినీ వ్యాన్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత రాత్రి కొత్తపల్లి నుంచి కైకలూరు వస్తుండగా మార్గం మధ్య భీమడోలు శివారు అంబరుపేటలోని హైవే వద్దకు వచ్చే సరికి సోమవారం తెల్లవారు జామున నిద్ర మత్తులో ముందు వెళుతున్న లారీని ఢీకొంది. దీంతో మినీ వ్యాను డ్రైవర్ వీర్రాజు క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చావా సురేష్ తెలిపారు.