వేసవి గడిచేదెలా?

ABN , First Publish Date - 2022-03-16T06:29:46+05:30 IST

ఈ ఏడాది వేసవిలో జిల్లాకు తాగునీటి ఎద్దడి తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

వేసవి గడిచేదెలా?

నిధుల్లేక తాగునీటి పథకాలు విలవిల
పడకేసిన సత్యసాయి తాగునీటి పథకం
మరమ్మతుల బారిన సీపీడబ్ల్యూ స్కీమ్‌లు


ఏలూరు సిటీ : ఈ ఏడాది వేసవిలో జిల్లాకు తాగునీటి ఎద్దడి తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రజలకు తాగు నీరు సరఫరా చేస్తున్న వివిధ పథకాలు సమస్యల ఒడిలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిధులు మంజూరు కాకపో వడం, ఉన్న నిధులు వేరే వాటికి మళ్లించడంతో తాగునీటి పథకాల పరిస్థితి అధ్వానంగా మారింది. జిల్లాలో 909 పంచా యతీల్లో 1,062 గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సీపీడబ్ల్యూ ఎస్‌ స్కీమ్‌లు 40, పీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లు 2,052, ఎంపీ డబ్ల్యూఎస్‌ స్కీమ్‌లు 520, డైరెక్ట్‌ పంపింగ్‌ స్కీమ్‌లు 570 ఉన్నాయి. పోలవరం, తాళ్ళపూడి, బుట్టాయిగూడెం, జీలుగు మిల్లి, చింతలపూడి, టి.నరసాపురం, ఉండి మండలాల్లోని 270 గ్రామాలకు సత్య సాయి తాగునీటి పథకం ద్వారా తాగునీరం దించేవారు. బకాయిలు పేరుకుపోవడంతో ఇది నిలిచిపోయిం ది. ఏడాదికి పైగా ఉద్యోగులకు జీతాల్లేవు. ఈ పథకం లేకపో తే వేసవిలో తాగునీటి సమస్య తప్పదని జడ్పీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుచోట్ల రక్షిత మంచినీటి పథకాలు మరమ్మతులకు నోచుకున్నాయి. గ్రామా లకు ఆర్థిక సంఘ నిధులు రాకపోవ డంతో మరమ్మతులు కష్టతరంగా తయారైంది. చేతి పంపులకు సైతం మరమ్మ తులు చేయకపోవడంతో సమస్య జఠిలం కానుంది.

Read more