-
-
Home » Andhra Pradesh » West Godavari » dont think about suicide says sp-NGTS-AndhraPradesh
-
ఆత్మహత్య.. ఆ..ఆలోచనే వద్దు : ఎస్పీ
ABN , First Publish Date - 2022-09-11T06:35:05+05:30 IST
ప్రపంచ ఆత్మ హత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఇండియన్ సైక్రియాట్రిక్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ఎస్పీ కార్యాలయంలో ఆశ్రం ఆసుపత్రి సైక్రియా ట్రిక్ పీజీ విద్యార్థులు, మానసిక వైద్యుల అసోసియేషన్ సభ్యులతో ఆత్మహత్య నివారణ దినోత్సవం నిర్వహిం చారు.

ఏలూరు కలెక్టరేట్, సెప్టెంబరు 10 : ప్రపంచ ఆత్మ హత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఇండియన్ సైక్రియాట్రిక్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ఎస్పీ కార్యాలయంలో ఆశ్రం ఆసుపత్రి సైక్రియా ట్రిక్ పీజీ విద్యార్థులు, మానసిక వైద్యుల అసోసియేషన్ సభ్యులతో ఆత్మహత్య నివారణ దినోత్సవం నిర్వహిం చారు. తొలుత ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య ఆలో చనే వద్దన్నారు. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని సమస్యకు పరిష్కారం చావు కాకూ డదని, ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంద న్నారు.మానసిక వైద్యనిపుణులు గిరిపర్తి నాగభూషణం, ప్రభుత్వాసుపత్రి వైద్యులు తవ్వా రామ మోహనరావు తదితరులు మాట్లాడుతూ సమస్యలను ధైర్యం, మానసిక స్ధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. పోలీస్ డిస్పెన్సరీ వైద్యులు హరీష్య ఫరీద్, డాక్టర్ పవన్‌కుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, ఇన్‌ఛార్జి డీఎస్పీ పైడేశ్వరరావు, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ కళాశాల నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.