బీచ్‌లో దుకాణాల తొలగింపు ఆపాలి

ABN , First Publish Date - 2022-12-13T00:02:45+05:30 IST

పేరుపాలెం బీచ్‌లో దుకాణాల తొలగింపు చర్యలు నిలుపుదల చేయాలని సీపీఎం నేతలు సోమవారం సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజకు వినతి పత్రం అందించారు.

బీచ్‌లో దుకాణాల తొలగింపు ఆపాలి
సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న సీపీఎం నాయకులు

నరసాపురం, డిసెంబరు 12: పేరుపాలెం బీచ్‌లో దుకాణాల తొలగింపు చర్యలు నిలుపుదల చేయాలని సీపీఎం నేతలు సోమవారం సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజకు వినతి పత్రం అందించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె పెద్దిరాజు మాట్లాడుతూ తీర ప్రాంతంలో వందలాది ఎకరాలు భూస్వాముల ఆధీనంలో ఉన్నాయని, వాటిని పేదలకు ఇవ్వాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రిసార్ట్స్‌ను తొలగించాలన్నారు. ఎం.త్రిమూర్తులు, రామ్మోహన్‌, కె.బాబూరావు, నాగరాజు, ఎం.రాజారావు, శివరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:02:45+05:30 IST

Read more