మహా పాదయాత్రకు విరాళాలు

ABN , First Publish Date - 2022-09-28T06:15:26+05:30 IST

రాష్ర్టానికి అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు రూ. 2 లక్షల విరాళాన్ని మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో దాత అందజేశారు.

మహా పాదయాత్రకు విరాళాలు
రూ.2 లక్షల చెక్కును మాగంటికి అందజేస్తున్న అన్నే రాధాకృష్ణ

కైకలూరు, సెప్టెంబరు 27: రాష్ర్టానికి అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు  చేపట్టిన మహా పాదయాత్రకు రూ. 2 లక్షల విరాళాన్ని మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో దాత అందజేశారు. మంగళవారం ఏలూరు క్రాంతి ఫంక్షన్‌ హాలులో పాద యాత్ర చేస్తున్న రైతుల సహాయార్థం కైకలూరు మండలం శీతనపల్లి గ్రామా నికి చెందిన అన్నే రాధాకృష్ణ ఈ  విరాళాన్ని అందజేశారు. మహా పాదయా త్రకు రైతులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ మండల అధ్యక్షుడు పెన్మెత్స త్రినాథరాజు, గుర్రం శ్యామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


రావిచర్ల గ్రామస్థులు రూ. 65 వేలు


నూజివీడు: అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ నూజివీడు నియోజకవర్గం రావిచర్ల సర్పంచ్‌ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రావిచర్ల గ్రామస్థులు మంగళవారం ఏలూరులో మాగంటి బాబు చేతుల మీదుగా రూ. 65 వేలు విరాళాన్ని అందించారు. కాపా శ్రీనివాసరావు, లావు ప్రసాద్‌, లావు మురళీ, అక్కినేని చందు, బొద్దు రామారావు, మొవ్వా శ్రీనివాసరావు, మరీదు చెన్న కేశవరావు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.Read more