స్పందనకు వస్తుంటే కుక్క దాడి....

ABN , First Publish Date - 2022-09-27T05:22:34+05:30 IST

స్పందనకు వస్తున్న ఒక వృద్ధురాలు కుక్కకాటుకు గురైంది.

స్పందనకు వస్తుంటే కుక్క దాడి....
వృద్ధురాలికి టీటీ ఇంజక్షన్‌ చేస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 26 : స్పందనకు వస్తున్న ఒక వృద్ధురాలు  కుక్కకాటుకు గురైంది.  జంగారెడ్డిగూడెం  పట్టణం డాంగేనగర్‌కు  చెందిన  నాగమ్మ  అనే  వృద్ధురాలు స్పందనలో తన ఇబ్బందులు  విన్నవించుకునేందుకు వస్తుండగా  స్థానిక టౌన్‌ హాల్‌ సమీపంలో ఒక కుక్క దాడి చేసి కాలుపై కరిచింది. స్పందన కేంద్రానికి పక్కనే ఈ సంఘటన  జరగడంతో స్థానిక యువకుడు ఆమెను  స్పందనలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం వద్దకు తీసుకువెళ్లి చికిత్స అందించారు.


Read more