పీహెచ్‌సీలో మరిన్ని సేవలందించాలి

ABN , First Publish Date - 2022-11-24T00:40:57+05:30 IST

పీ హెచ్‌సీకి వచ్చే వారికి ఉన్నతమైన సేవలందించాలని జిల్లా వైద్యాధికారి మహేశ్వరరావు అన్నారు.

పీహెచ్‌సీలో మరిన్ని సేవలందించాలి
పీహెచ్‌సీ సిబ్బందితో డీఎంహెచ్‌వో

ఆచంట, నవంబరు 23: పీహెచ్‌సీకి వచ్చే వారికి ఉన్నతమైన సేవలందించాలని జిల్లా వైద్యాధికారి మహేశ్వరరావు అన్నారు. ఎ.వేమవరం పీహెచ్‌సీని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ల్యాబ్‌ను, ఫార్మసీ రూమ్‌ను, డెలివరీ రూమ్‌, జనరల్‌ వార్డును, ఇమ్యునైజేషన్‌, స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. పీహెచ్‌సీలో ఎక్కువ కాన్పులు అయ్యేలా చూడాలని వైద్యురాలు ఎ.పూజతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చారు.

Updated Date - 2022-11-24T00:40:59+05:30 IST