అష్టభుజ లక్ష్మీనారాయణస్వామికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-12-31T00:12:17+05:30 IST

అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

అష్టభుజ లక్ష్మీనారాయణస్వామికి ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 30: అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచి ప్రధాన అర్చకులు కె.శ్రీని వాసాచార్యులు, పవన్‌కుమార్‌, స్వామి, అమ్మవార్లకు పూజలు, తిరుమంజన సేవలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. డైలీ మార్కెట్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, శంభన్న అగ్రహారం వేంకటేశ్వరస్వామి ఆలయం, కెనాల్‌ రోడ్డులోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కనక దుర్గమ్మ ఆలయంలో..

యడ్ల బజారులోని కనక దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి భక్తులు, మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు జరిపించుకున్నారు. ఉల్లంపర్రులోని కనక దుర్గ ఆలయం వద్ద శుక్రవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం6 గంటల వరకూ ఏకధాటిగా 25 మంది మహిళలు లలితా సహస్ర పారాయణం చేశారు. లోక శాంతి కోరుతూ నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు మద్దాల వాసు, సామ వేదం వసంత లక్ష్మీ, అరుణ, పి.కొండ మాలక్ష్మీ, ఎస్‌.నాగలక్ష్మి పాల్గొన్నారు.

జుత్తిగలో పార్వతీ దేవి అమ్మవారికి విశేష పూజలు

పెనుమంట్ర, డిసెంబరు 30: జుత్తిగ లోని ఉమా వాసుకీ రవిసోమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పార్వతీ దేవి అమ్మవారికి విశేష పూజలు, కుంకు మార్చన చేశారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఉమా వాసుకి రవి సోమేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలను అర్చకులు ర్యాలీ వాసు శర్మ రామకృష్ణ శర్మ ఫణీంద్రశర్మ నిర్వ హించారు. అష్టమి తిధి ఉండడంతో క్షేత్రపాలకుడైన కాలభైరవునికి అభిషేకాలు పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-12-31T00:12:17+05:30 IST

Read more