గడప గడపకు.. ‘డెల్టా’ కార్మికులు

ABN , First Publish Date - 2022-05-19T05:20:13+05:30 IST

డెల్టా పేపర్‌మిల్లు మూసివేతపై 99 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.

గడప గడపకు.. ‘డెల్టా’ కార్మికులు
పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న జేఏసీ నాయకులు

పాలకోడేరు, మే 18: డెల్టా పేపర్‌మిల్లు మూసివేతపై 99 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు స్పందించకపోవడంతో గడప గడపకు పాదయాత్ర చేపట్టినట్లు వేండ్ర డెల్టా పేపర్‌ మిల్లు జేఏసీ నాయకులు తెలిపారు. డెల్టా పేపర్‌ మిల్లు గేటు నుంచి గడప గడప కార్మికుల పాతయాత్ర జేఎన్‌వీ గోపాలం బుధవారం ప్రారంభించారు. కొండేపూడి, రామచంద్రాపురం, వెంకటాపురం మొదలైన గ్రామాలలో గడపగడపకు ప్రజలను కలుస్తామన్నారు. మిల్లు మూసివేత నుంచి జరుగుతున్న పరిణామాలు, వెయ్యి కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోవడాన్ని కార్మికులు ఇంటింటా వివరిస్తున్నారు. గోపాలన్‌ మాట్లాడుతూ పరోక్షంగా వేలాది మంది రైతులు, వ్యాపారులు, చేతి వృత్తిదారులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. గ్రామ పంచాయితీ కోల్పోతున్న పేపర్‌మిల్లు ఆదాయం గురించి ప్రజా ప్రతినిధులకు, ప్రతిపక్షాలు, ప్రజలకు తెలియపరుస్తూ సచివాలయం, గ్రామ సర్పంచ్‌లకు వినతిపత్రం ఇచ్చామ న్నారు. గడప గడపకు కరపత్రం పంపిణీ చేశారు. భవిష్యత్‌లో తలపెట్టే కార్యక్రమాలకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘ కార్మిక నాయుకుడు అశ్రియ, జేఏసీ నాయకులు వి.భ ద్రం, వైఎస్‌ఎన్‌.మూర్తి, టి.సుబ్రహ్మణ్యం, పి.అశోక్‌, కె.వెంకట్రావు, సీహెచ్‌.కు టుంబరావు, సత్యనారాయణ, కె.మీరయ్య, ఆంజనేయరాజు, ఏఐటీయూసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:20:13+05:30 IST