నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2022-09-26T05:10:05+05:30 IST

ఏలూరు నగరంలోని పలు డివి జన్లలో సోమవారం నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు దేవీ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ఆయా కమిటీల సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు.

నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు
ఏలూరు పట్టణంలోని అంబికాదేవి

భారీ ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ నిర్వాహకులు

ఏలూరుకార్పొరేషన్‌/ కామవరపుకోట/ ద్వారకా తిరు మల, సెప్టెంబరు 25 : ఏలూరు నగరంలోని పలు డివి జన్లలో సోమవారం నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు దేవీ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ఆయా కమిటీల సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆల యాలను రంగులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రవేశ మార్గాలు, సామూహిక పూజలకు ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు.  సత్రంపాడులోని అంబికాదేవి, సౌభాగ్యలక్ష్మీదేవి, దక్షిణపు వీధిలోని మహిషాసుర మర్దినిదేవి, బాల త్రిపుర సుందరి దేవి, కంచికామాక్షి, అగ్రహారంలోని రాజ్యలక్ష్మీదేవి, కన్యకాపరమేశ్వరిదేవి, జ్ఞాన సరస్వతీదేవి, పవరుపేటలోని కాశీ అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, అగ్రహారం, బావిశెట్టివారి పేట, పన్నెండుపంపుల సెంటర్‌, పత్తేబాద, తదితర ప్రాంతాల్లోని కనక దుర్గాదేవి, బావిశెట్టివారిపేటలోని భూలోకమ్మ తల్లి అమ్మవార్ల ఆలయాల వద్ద నవరా త్రులు జరగనున్నాయి. ఈ పది రోజులు రోజుకో అలంకారంలో అమవార్లు దర్శనమీయనున్నారు.

లక్ష్మీ హయగ్రీవ లలితా పీఠంలో..

కామవరపుకోటలోని లక్ష్మీ హయగ్రీవ లలితా పీఠంలో శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నట్టు పీఠం వ్యవస్థాపకుడు సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు, సహాయకులు సత్య శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఉదయం, సాయం త్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహిళలతో సామూ హిక కుంకుమార్చనలు జరిపిస్తామన్నారు. అదేవిధంగా రామాలయం, వీరభద్రస్వామి ఆలయం, ఆడమిల్లిలోని కంచి కామాక్షి, తడికలపూడిలోని గాంగేశ్వరస్వామి, కళ్ళచెరువు, జీలకర్రగూడెం, రావికం పాడులలో గల కనకదుర్గాదేవి ఆలయాల్లో కూడా నిర్వాహకులు మహోత్సవాలను నిర్వహించనున్నారు.

కుంకుళ్లమ్మ వారి ఆలయంలో..

ద్వారకాతిరుమలలోని క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రులు సోమవారం నుంచి ప్రారం భం కానున్నాయి. ఇప్పటికే దేవస్థానం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వచ్చేనెల ఐదో తేదీ వరకు అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈవో వేండ్ర త్రినాఽథ రావు తెలిపారు. ఇందులో భాగంగా 26న మహారేణుకా దేవిగా, 27న బాలాత్రిపుర సుందరిదేవిగా, 28న గాయత్రి దేవిగా, 29న అన్నపూర్ణాదేవిగా, 30న లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారన్నారు. అలాగే వచ్చేనెల ఒకటో తేదీన మహాలక్ష్మీదేవిగా, 2న మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవిగా, 3న దుర్గాదేవిగా, 4న మహిషాసురమర్దినిగా, 5న రాజరాజేశ్వరిదేవిగా దర్శనమివ్వనున్నారు. అదేరోజు సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో అమ్మవారి రథోత్సవం, 6న ఇరుముడుల సమర్పణ, చండీహోమం జరుగుతాయి. 7న ఆలయం వద్ద భారీ అన్నసమారాధన ఉంటుందని, దీనికి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఈవో త్రినాథరావు ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2022-09-26T05:10:05+05:30 IST