పిల్లల ఏడ్పులు.. పెద్దల నిట్టూర్పులు

ABN , First Publish Date - 2022-04-10T05:47:35+05:30 IST

‘చిన్న పిల్లల ఏడ్పులు.. బాలింతల ఆపసోపాలు.. బంధువుల నిట్టూర్పులతో’ తణుకు ఏరియా ఆసుపత్రి దద్దరిల్లింది. వరుస కరెంటు కోతలతో జనమే కాదు.. ఆసుపత్రుల్లో రోగులు, పసిబిడ్డలు పడు తున్న వేదనకు ఈ చిత్రమే నిదర్శనం.

పిల్లల ఏడ్పులు.. పెద్దల నిట్టూర్పులు
పేపర్లు, విసనకర్రలతో విసురుకుంటున్న బంధువులు

కరెంటు కోతలతో తణుకు ప్రభుత్వాసుపత్రి వార్డుల్లో ఇబ్బందులు

తణుకు, ఏప్రిల్‌ 9 : ‘చిన్న పిల్లల ఏడ్పులు.. బాలింతల ఆపసోపాలు.. బంధువుల నిట్టూర్పులతో’ తణుకు ఏరియా ఆసుపత్రి దద్దరిల్లింది. వరుస కరెంటు కోతలతో జనమే కాదు.. ఆసుపత్రుల్లో రోగులు, పసిబిడ్డలు పడు తున్న వేదనకు ఈ చిత్రమే నిదర్శనం. మూడు రోజుల క్రితం రాత్రి వేళల్లో ఒక్కసారిగా కరెంటు పోవడంతో కలకలం రేగింది. అసలే వేసవి కాలం.. ఆపై ఉక్కబోతగా ఉండడంతో అప్పుడే పుట్టిన పసి బిడ్డల నుంచి వారి తల్లుల వరకు తీవ్ర అసహనానికి గురయ్యారు. చాలా సేపటి వరకు కరెంటు రాకపోవడంతో వార్డులోకి గాలి రాలేదు. రోగులు, బంధువులు విసన కర్రలతో విసురుకుంటూ కాలం గడపారు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శివ ప్రసాద్‌ను వివరణ కోరగా మూడు రోజుల క్రితం కరెంటు పోయినపుడు జనరేటర్‌ వేయడం కొద్దిగా ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు కరెంటు పోయినా ఆ పరిస్థితి లేదని వివరణ ఇచ్చారు.  

Read more