పది నిమిషాల్లో.. యువతి ఆచూకీ పట్టేశారు

ABN , First Publish Date - 2022-03-16T06:34:37+05:30 IST

ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ యువతి ఆచూకీని సెల్‌ ఫోన్‌ ఆధారంగా సెల్‌టవర్‌ తెలపడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట పోలీసులు పది నిమిషాల్లో గుర్తించి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

పది నిమిషాల్లో.. యువతి ఆచూకీ పట్టేశారు

 క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు


పెదవేగి, మార్చి 15 :
ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ యువతి ఆచూకీని సెల్‌ ఫోన్‌ ఆధారంగా సెల్‌టవర్‌ తెలపడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట పోలీసులు పది నిమిషాల్లో  గుర్తించి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. పెదవేగి మండలం వంగూరుకు చెందిన 19 ఏళ్ల యువతి సోమవారం ఉదయం ఇంటి నుంచి పారిపోయింది. ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితుడైన సూళ్లూరుపేట సమీపంలోని కారిపాకానికి చెందిన ఓ యువకుడికి ఫోన్‌ చేసి తనకు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించా లని చెప్పకుండా వచ్చేస్తున్నానని తెలిపింది. సోమవారం రాత్రి 10.30 గంటలకు ఆ యువకుడు సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆమెను రిసీవ్‌ చేసుకున్నాడు. ఓ సెల్‌ఫోన్‌ కంపెనీలో ఉదయం ఇంటర్వ్యూ ఉందని, అప్పటి వరకు కొండూరు వద్ద ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉండాలని వదిలి పెట్టాడు. అప్పటికే ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పెదవేగి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె సెల్‌ ఫోన్‌ను ట్రాక్‌ చేయగా సూళ్లూరు పేటలో ఉన్నట్లు గుర్తించారు. పెదవేగి ఎస్‌ఐ వైవీవీ సత్యనారాయణ సూళ్లూరుపేట ఎస్‌ఐ రవిబాబుకు సమా చారం అందించారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కొండూరు ప్రాంతంలో ఒక వసతి గృహంలో ఉన్న యువతిని పది నిమిషాల్లోనే గుర్తించి, సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులతో మాట్లాడించారు. వారు మంగళవారం ఉదయానికి స్టేషన్‌కు చేరుకున్నారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో పోలీసులు ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్పీ విజయరావు అభినందిస్తూ గూడూరు డీఎస్పీ ద్వారా ఎస్‌ఐ రవిబాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ జార్జీ, కానిస్టేబుల్‌ ప్రదీప్‌, కిరణ్‌బాబులకు రివార్డులు అందజేశారు.


Read more