‘సీపీఎస్‌’ బైక్‌ ర్యాలీకి అడ్డంకులు

ABN , First Publish Date - 2022-04-24T05:36:56+05:30 IST

జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన సీపీఎస్‌ రద్దు హమీ నిలబెట్టుకోవాలంటూ యూటీఫ్‌ ఉపా ధ్యాయ సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. ఐదుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, యూటీఫ్‌ ఆధ్వరం్యలో ఈనెల 17వ తేదీన ఇచ్చా పురం,

‘సీపీఎస్‌’ బైక్‌ ర్యాలీకి అడ్డంకులు
సీపీఎస్‌ రద్దు కోరుతూ బైక్‌ ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్సీ సాబ్జీ , యూటీఫ్‌ నాయకులను పెదవేగి వద్ద అడ్డుకున్న పోలీసులు

 పెదవేగి వద్ద 30 మంది యూటీఎఫ్‌ నాయకుల అరెస్టు 

నిడమర్రు ఏప్రిల్‌ 23 : జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన సీపీఎస్‌ రద్దు హమీ నిలబెట్టుకోవాలంటూ యూటీఫ్‌ ఉపా ధ్యాయ సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. ఐదుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, యూటీఫ్‌ ఆధ్వరం్యలో ఈనెల 17వ తేదీన ఇచ్చా పురం, పార్వతీపురంలో బైక్‌ ర్యాలీ ప్రారంభించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా సాగుతున్న తరు ణంలో బైక్‌ ర్యాలీలను పోలీసులు శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏలూరు జిల్లా పెదవేగిలో అడ్డుకున్నారు.  జిల్లాలో బైక్‌ జాతా కేవలం 24 గంటల్లో ముగియనుండగా 7 రోజులు అనుమతించి ఇప్పుడెందుకు అడ్డుకొన్నారు..? అని ప్రశ్నిస్తే మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. ప్రభుత్వమే ఉద్యమాన్ని అణగ దొక్కాలని నిర్ణయించకోవడం దారణమని ఎమ్మెల్సీలు విమర్శించారు.  ప్రభుత్వ వైఖరిని ఉద్యోగ ఉపాధ్యాయ లోకం అర్థం చేసుకొని మరింత తీవ్రంగా పోరాడేందుకు సిద్ధం కావా లన్నారు. ఒక వైపు  ఈనెల 24 చర్చలకు పిలిచి మరో వైపు నాయకులను అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నిస్తు న్నారు. పెదవేగిలో సీపీఎస్‌ రద్దు బైక్‌ జాతాకి సారఽథ్యం వహిస్తున్న పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీతో పాటు యూటీఫ్‌ రాష్ట్ర కార్య దర్శులు జి.ప్రభాకరవర్మ, పి.వి.రాఘవులు, జిల్లా అధ్యక్షుడు ఆర్‌.రవికుమర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.నరసింహరావు తదితర 31 మంది ఉపాధ్యాయ ఉద్యమ నేతలను అరెస్టు చేశారు. మండుటెండలో వారిని అరెస్టు చేసి పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ హోం మంత్రి తానేటి వనితతో జరిపిన చర్చల పిమ్మట ఉద్యమ నాయ కులను సాయంత్రం 5 గంటలకు షరతులతో విడుదల చేశారు. సాబ్జీ మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు కోరుతూ ఈ నెల 25న తలపెట్టిన ముఖ్య మంత్రి కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యా యులు ప్రతిఒక్కరూ కదిలి రావాలని పిలుపు నిచ్చారు. పోరాడితేనే సీపీ ఎస్‌ రద్దు సాధ్యమవు తుందని  జగన్‌ దయా దాక్షిణ్యాలపై కాదన్నారు.  మోగల్లులో జరిగిన బైక్‌ ర్యాలీలో పోలీసులు సుమారు 50 మందితో వచ్చి యూటీఫ్‌ ఉద్యమ నాయకుడైన రాష్ట్ర కోశాధికారి పి.గోపి మూర్తిని అరెస్టు చేశారు. ఈయనతో పాటు ఉద్యమ నాయకులు సి.హెచ్‌.రవీంద్ర, జయరామరాజు, జయ కుమార్‌, రత్నంరాజు, రాజశేఖర్‌లను అరెస్టు చేశారు. 


Updated Date - 2022-04-24T05:36:56+05:30 IST