తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీని మూసివేయాలి

ABN , First Publish Date - 2022-11-24T23:42:51+05:30 IST

కాలుష్య భరితంగా మారిన తుందుర్రు మెగా ఆక్వా ఫ్యాక్టరీని తక్షణం మూసివేయాలని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధు డిమాండ్‌ చేశారు. పది రోజుల్లో ఈ ఫ్యాక్టరీని మూసి వేయని పక్షంలో డిసెంబరు నాలుగు నుంచి మళ్లీ ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.

తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీని మూసివేయాలి
నరసాపురంలో విలేకర్లతో మాట్లాడుతున్నమధు

లేనిపక్షంలో డిసెంబరు 4 నుంచి మళ్లీ ఉద్యమం

సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు

నరసాపురం, నవంబరు 24 : కాలుష్య భరితంగా మారిన తుందుర్రు మెగా ఆక్వా ఫ్యాక్టరీని తక్షణం మూసివేయాలని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధు డిమాండ్‌ చేశారు. పది రోజుల్లో ఈ ఫ్యాక్టరీని మూసి వేయని పక్షంలో డిసెంబరు నాలుగు నుంచి మళ్లీ ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. గురువారం నరసాపురం మీరా గ్రంథాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యం వల్ల పరిసర గ్రామ ప్రజలు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. భూగర్భ జలాలు, చెరువులు, కాలువలు పూర్తిగా కాలుష్య కోరల్లో చుక్కుకున్నాయన్నారు. పరిసర గ్రామాల పంట పొలాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కాలుష్య మండలి పట్టించుకోకపోవడం దారుణ మన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే జరిగే ప్రమాదాలను ముందుగానే హెచ్చరించి అప్పట్లో అందోళనలు చేపడితే తమపై 28 రకాలు కేసుల పెట్టారన్నారు. ప్రభుత్వం వీటిని తీసివేస్తామని ప్రకటించిం గానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదన్నారు.ఉద్యమ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ తాము అధికారంలోకి వస్తే ఈ ఫ్యాక్టరీని మరో చోటకు తరలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే మూడేళ్లు గడిచినా ఈ హామీ నేరవేరలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఇచ్చిన హామిని నెరవేర్చాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ పండిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి, దిగుబడులపై ప్రభుత్వం విధించిన సీలింగ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా మాజీ కార్యదర్శి మంతెన సీతారాం, కవురు పెద్దిరాజు, పూరేళ్ల శ్రీనివాస్‌, ముచ్చర్ల త్రిమూర్తులు,రామాజనేయులు, పూర్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:42:54+05:30 IST