కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2022-01-23T05:49:21+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య ఎక్స్‌ప్రెస్‌ వేగంతో పెరుగుతోంది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులకు సన్నిహితంగా ఉన్న కాంటాక్ట్‌ వ్యక్తుల ను త్వరితగతిన గుర్తించి లక్షణాలు ఉన్న వారికి కరోనా టెస్టులను చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాల్సింది పోయి రోజు వారీ టెస్టుల సంఖ్యను పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

కరోనా కల్లోలం

వేగంగా పెరుగుతున్న కేసులు

 ఒక్కరోజే 691 మంది బాధితులు

 29 శాతానికి పెరిగిన పాజిటివిటీ

 టెస్ట్‌ల సంఖ్య పరిమితంపై విమర్శలు


ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 22 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య ఎక్స్‌ప్రెస్‌ వేగంతో పెరుగుతోంది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులకు సన్నిహితంగా ఉన్న కాంటాక్ట్‌ వ్యక్తుల ను త్వరితగతిన గుర్తించి లక్షణాలు ఉన్న వారికి కరోనా టెస్టులను చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాల్సింది పోయి రోజు వారీ టెస్టుల సంఖ్యను పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. శనివారం జిల్లావ్యాప్తంగా 691 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పాజిటివిటీ రేటు 29 శాతా నికి చేరింది. కేవలం రెండు వేల టెస్టు లకే పాజిటివ్‌ కేసులు 700లకు చేరువ కాగా పరీక్షల సంఖ్య పెంచితే వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఎంత ఉంటుందో అంచనాకు రావచ్చునని వైద్య వర్గాలే చెబుతున్నాయి.


అవసరాన్ని బట్టే కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

సోమవారం నుంచి పూర్తిస్థాయిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థానికంగా కొవిడ్‌ వ్యాప్తి తీవ్రత, బాధితుల సంఖ్య బట్టే సెంటర్లను అందుబాటులోకి తీసుకు రావాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు సీసీసీల్లో వైద్య సిబ్బం ది నియామకాలు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. మూడో దశ కరోనా ఉధృతిలో వైరస్‌ బారినపడుతున్న వారిలో అత్యధికులు 20–35 ఏళ్ల వయసు వారున్నారు. 


కొవిడ్‌ బారిన అధికారులు

 కరోనా బారిన పలువురు అధికారులు పడుతున్నారు. వీరవాసరం పీహెచ్‌సీలో వైద్యాధికారి, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ ఎంలు పాజిటివ్‌ జాబితాలో చేరా రు. పోలీస్‌ సిబ్బంది పాజిటివ్‌ బారిన పడటంతో స్టేషన్‌ శానిటేషన్‌ చేయించారు.    జంగారెడ్డిగూడెం మండలం లక్క వరం పీహెచ్‌సీలోని ఇద్దరు స్టాఫ్‌ నర్సులకు, హౌసింగ్‌ శాఖలో ఒక అధికారికి, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖలో ఒక ఉద్యోగికి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఒక ఉద్యోగి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయా కార్యాలయాల్లో సిబ్బంది ఆందోళన చెందుతు న్నారు. ఆకివీడు ఎస్‌ఐకి కరోనా సోకింది. అనుమానం వచ్చి శనివారం ప్రైవే టుగా పరీక్ష చేయించుకోగా పాజ టివ్‌ నిర్ధారణ అయింది. అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవు.


చిన్నారికి పాజిటివ్‌

ఆకివీడు శాంతినగర్‌ కాలనీలో రెండేళ్ల పాపకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. ఈ పాప ఉంటున్న ఇంట్లో పది రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారని పరీక్షలు నిర్వహించగా పాపతోపాటు మరొకరికి పాజిటివ్‌ తేలిందని పీహెచ్‌సీ డాక్టర్‌ తెలిపారు. పాప పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.


మరో 24 మంది టీచర్లకు పాజిటివ్‌ 

జిల్లాలో టీచర్లపై కొవిడ్‌ ప్రతాపం కొనసాగుతుంది. శని వారం కొత్తగా 24 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌ పాజి టివ్‌ నిర్ధారణ అయ్యింది. వీటితో సోమవారం నుంచి శని వారం వరకు మొత్తం 82 మంది టీచర్లు కొవిడ్‌ బారిన పడినట్టయింది. తాజాగా కరోనా నిర్ధారణ అయిన టీచర్లలో వల్లూరు, మట్టపర్తిగరువు, యాడంగి, ఊనగట్ల, అశోక్‌న గర్‌ (జంగారెడ్డిగూడెం), సుబ్బారాయుడుపేట, ఉల్లంపర్రు, కూచింపూడి, కొప్పాక, గూట్లపాడు, కోపల్లె, మాధ వరం, ఎ.వి.పాలెం, అనాకోడేరు, భీమోలు, చింతలపూడి, తూర్పు తాళ్ళు, కాపవరం, నడుపల్లికోట(పెరవలి), కానూరు, విస్సా కోడేరు పాఠశాలలకు చెందిన వారు ఉన్నారు.


హైరిస్క్‌ లేకుంటే డోలోతో సరి 

ప్రస్తుతం చలి వాతావరణం తీవ్రత ఎక్కువగా ఉన్నం దున ఈ సీజన్‌లో సహజంగానే జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీ రసం, తలనొప్పి వంటివి వస్తుంటాయని, అలాగని వీటితో బాధపడేవారందరికీ కొవిడ్‌ టెస్టులు చేయనవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ వాదన చేస్తోంది. ఇటువంటి  అనారోగ్యంతో ఉంటే సాధారణ పరిస్థితుల్లో ఐదు రోజుల్లోనే తగ్గి పోతుందని, స్వల్ప లక్షణాలుంటే డోలో మాత్రలు వైద్యుల సూచనల మేరకు వేసుకుని జాగ్రత్తలు పాటిస్తే సరిపో తుందని చెబుతున్నారు. అయితే పైలక్షణాలతో తీవ్ర అనారోగ్యం ఉంటే మాత్రమే కరోనా టెస్టులకు సిఫార్సు చేస్తున్నారు. దీనికోసం అన్ని పీహెచ్‌సీల స్థాయిలో రోగి లక్షణాలను పరీక్షించి కరోనా నిర్ధారణ అయితే హోం ఐసో లేషన్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆసుపత్రులకు సిఫార్సు చేసేం దుకు వీలుగా ట్రయాజింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వివరించాయి.


17 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు  :  జేసీ అంబేడ్కర్‌

ఏలూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 17 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీటి ద్వారా మొత్తం 880 పడకలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆకివీడు, చింతలపూడి టీటీడీ కల్యాణ మండపాల్లో 60 చొప్పున, కొవ్వూరు, తణుకు, గణపవరం, తాడేపల్లిగూడెం, ఆచంట టీటీడీ కల్యాణ మండపాల్లో 50 చొప్పున, ఉండి బాలుర హాస్టల్‌, ఆకివీడు బీసీ బాలుర హాస్టల్‌, పాలకొల్లు, నర్సాపుర, వీరవాసరం టీటీడీల్లో 40 పడకలు చొప్పున, భీమవరం మిల్లర్స్‌ అసోసియేషన్‌ బిల్డింగులో 80, పోలవరం మండలంలోని డాక్టర్‌ జే. లియోనార్డ్‌ బెల్‌ మెమోరియల్‌ ఆసుపత్రిలో 100 పడకలతోనూ కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


రేపు స్పందన రద్దు

ఏలూరు : కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నియంత్రణలో భాగంగా ఈనెల 24న జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌ సహా జిల్లాలోని అన్ని డివిజన్‌, మండల, మున్సిపల్‌ స్థాయిలలో జరిగే స్పందన కార్యక్రమం ఉండదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను స్పందన వెబ్‌ పోర్టల్‌ ‘స్పందన.ఏపీ.జీవోవీ.ఇన్‌’లో ఆధార్‌ కార్డు నెంబరు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. Read more