సారా బాధిత కుటుంబాలకు కాంగ్రెస్‌ నేతల పరామర్శ

ABN , First Publish Date - 2022-03-16T05:45:58+05:30 IST

కల్తీ సారా బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు.

సారా బాధిత కుటుంబాలకు కాంగ్రెస్‌ నేతల పరామర్శ
మృతుడు అప్పారావు చిత్రపటం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నేతల నివాళి

జంగారెడ్డిగూడెం, మార్చి 15: కల్తీ సారా బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు. ఏలూరు జిల్లా కాంగ్రెసు కమిటీ, జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ, మహిళ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మృ తులు ముడిచర్ల అప్పారావు, బండారు శ్రీను, బొంకూరి రాంబాబు కుటుం బ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్‌, ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు ప్రగలపాటి కాశీ, తాడేపల్లి ఉమ, వీరవల్లి సోమేశ్వరరావు, గోపిశెట్టి ప్రసాద్‌, బొరుసు ప్రసాద్‌, జీడికంటి రామారావు, మొగలినేడి శ్యామ్‌, కొల్లి రామసూర్యరెడ్డి పాల్గొన్నారు.

Read more