నగరంలో గ్రీనరీ పెంపునకు చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-11-25T00:14:58+05:30 IST

ఏలూరు నగరంలో పచ్చదనం పేరుతో కాలుష్య నివారణ చర్యలు చేపడుతు న్నామని, గ్రీనరీ పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొం దిస్తున్నామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు.

నగరంలో గ్రీనరీ పెంపునకు చర్యలు  : కలెక్టర్‌
గ్రీనరీ ఏర్పాటుకు స్థలం పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఏలూరు కలెక్టరేట్‌, నవం బరు 24 : ఏలూరు నగరంలో పచ్చదనం పేరుతో కాలుష్య నివారణ చర్యలు చేపడుతు న్నామని, గ్రీనరీ పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొం దిస్తున్నామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. గురువా రం సత్రంపాడు పెదచెరువు అభివృద్ధిలో భాగంగా నగర వనంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై టెరిటోరియల్‌ డివిజన్‌ డీఎఫ్‌వో రవీంద్రనాద్‌ధామా, ఆర్డీవో పెంచల్‌కిషోర్‌, కమిషనర్‌ షేక్‌ షాహిద్‌తో కలసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాలుష్యం బారినపడకుండా ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే హరిత విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మండల సర్వేయర్‌ విశ్వనాధం, మునిసిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:14:58+05:30 IST

Read more