-
-
Home » Andhra Pradesh » West Godavari » collector review with municipal officers-MRGS-AndhraPradesh
-
జిల్లా కేంద్రం రహదారులు అభివృద్ధి చేయాలి
ABN , First Publish Date - 2022-09-14T05:02:16+05:30 IST
భీమవరం జిల్లా కేంద్రం కావడం వల్ల కనెక్టింగ్ రోడ్లును అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు.

భీమవరం, సెప్టెంబరు 13: భీమవరం జిల్లా కేంద్రం కావడం వల్ల కనెక్టింగ్ రోడ్లును అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. పట్టణాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా పి.ప్రశాంతి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం అధికారులతో సమీక్షించారు. మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణాన్ని వేగవంతంగా అభివృద్ధి చెందేలా పనిచేయాలన్నారు. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టరు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ, ఎంఈ త్రినాథ్, టౌన్ ప్లాన్ ఏసీపీ గౌరు, టీపీఓ సర్వేశ్వరరావు, డీఈ రాజారావు, ఏఈలు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను వినియోగించుకోవాలి
క్రీడలకు సంబంధించి జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను ఆమె ఆవిష్కరించారు. కలెక్టరు మాట్లాడుతూ క్రీడాకారులు తమ సమాచారాన్ని అందించి క్లబ్‌లో చేరవచ్చన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సహకాలు అందించడానికి తోడ్పడుతుందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌వో ఆర్‌వి రమణ, చీఫ్ కోచ్ పి సురేంద్రబాబు, పీడీలు పాల్గొన్నారు.