CM Jagan పర్యటనలో విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ నినాదాలు..

ABN , First Publish Date - 2022-07-27T21:14:12+05:30 IST

అల్లూరి జిల్లా, చింతూరు మండలం, చట్టిలో వరద బాధితులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.

CM Jagan పర్యటనలో విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ నినాదాలు..

రాజమండ్రి (Rajahmundry): అల్లూరి జిల్లా, చింతూరు మండలం, చట్టిలో వరద బాధితుల (Flood Victms)ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పరామర్శించారు. ఈ సందర్బంగా విలీన మండలాల్లోని తమ గ్రామాలను తెలంగాణ (Telangana)లో కలపాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను పక్కకు నెట్టివేశారు.


సీఎం జగన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి పోలవరం (Polavaram) పరిహారం పూర్తి చేస్తామన్నారు. పోలవరం ముంపు బాధితులకు న్యాయం చేశాకే పునరావాస కాలనీలకు తరలిస్తామని, పోలవరం పునరావాసం కేంద్రం చేతుల్లో ఉందన్నారు. వెయ్యి కోట్లో, 2 వేల కోట్లో అయితే మేమే ఇచ్చే వాళ్లమని, రూ. 20 వేల కోట్లు కాబట్టి కేంద్రం సాయం ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ (R&R package) కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. 41.75 మీటర్ల వరకు నీళ్లు ఉంటే ముంపునకు గురయ్యేవారిని.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు తరలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Updated Date - 2022-07-27T21:14:12+05:30 IST