దేవుళ్లనీ వదలని సీఎం జగన్‌

ABN , First Publish Date - 2022-08-25T05:51:09+05:30 IST

మండపాల్లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించమనటం దారుణమని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆరోపించారు.

దేవుళ్లనీ వదలని సీఎం జగన్‌
వినాయక విగ్రహం, నిత్యావసర సరుకుల కావిడితో జయమంగళ

వినాయక మండపాలకు బాదుడుపై ఆగ్రహం

వినూత్న రీతిలో జయమంగళ నిరసన

ఎస్సార్పీ అగ్రహారంలో బాదుడే బాదుడు

కలిదిండి, ఆగస్టు 24 : మండపాల్లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించమనటం దారుణమని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆరోపించారు. బుధవారం ఎస్సార్పీ అగ్రహారంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.  టీడీపీ నేతలు గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జయమంగళ మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలనలో ప్రజలు ఐక్యత కోసం చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తుంటే బ్రిటిషర్లు దానిని వ్యతిరేకించే వారన్నారు. ఇప్పుడు మండపాలపై పన్నులు వసూలు చేస్తున్న జగన్‌ పాలన బ్రిటిష్‌ పాలనను తలపిస్తోందని, వారిని తరిమికొట్టినట్లు మిమ్మల్ని తరమాలా లేక వినాయకుడి మీద దోపిడీ ఆపుతారా అని జగన్‌ను ఉద్ధేశించి ప్రశ్నించారు.  మరోవైపు నిత్యావసర వస్తువులు ధరల పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగిన చంద్రబాబును 2024లో ముఖ్యమంత్రి చేయటానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. తొలుత వినాయకుడి విగ్రహం ఒకపక్క, నిత్యావసర వస్తువులు మరో పక్క ఉన్న కావడిని మోస్తూ వినూత్న  నిరసన తెలిపారు.  టీడీపీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజు, వల్లభనేని శ్రీనివాస్‌ చౌదరి, నున్న రమాదేవి, పరసా వెంకట స్వామి, లంకా రత్నారావు, భట్రాజు ఏసుబాబు, అండ్రాజు శ్రీనివాస్‌, వాకాని కోటేశ్వరరావు, కురేళ్ల ఏడుకొండలు, దావు నాగరాజు పాల్గొన్నారు. 

Read more