దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-23T05:34:12+05:30 IST

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి
కొవ్వూరు చేరుకున్న సీఐటీయూ ప్రచార జాతా

కొవ్వూరు, మార్చి 22: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మార్చి 28, 29 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ ప్రచారజాత మంగళవారం కొవ్వూరు చేరుకుంది. ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి చాలీచాలని వేతనాలు అందిస్తున్నారన్నారు. రెండవ దశ కొవిడ్‌లో మరణించిన కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఎటువంటి నష్టపరిహారం అందించకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగుల హక్కులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎం.సుందరబాబు, కె.విజయలక్ష్మి, శ్యామలరాణి, ఎం.నాగమణి, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, భవన నిర్మాణ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.


ద్వారకాతిరుమల: దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌.లింగరాజు పిలుపునిచ్చారు. యూటీఎఫ్‌ కా ర్యాలయం వద్ద మంగళవారం సీఐటీయూ ముఖ్యకార్యకర్తల సమావేశం బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగింది. ముందుగా సమ్మె పోస్టర్లను ఆవిష్కరిం చారు. వై.సాల్మన్‌రాజు, తులసి, శ్రీనివాసరావు, షేక్‌ కరీమ పాల్గొన్నారు.


అరెస్టులు, గృహ నిర్బంధాలు తగదు


కామవరపుకోట: ప్రజా పోరాటాలు చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం, గృహ నిర్బంధం చేయడం తగదని ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. తహసీల్దార్‌ జీవీవీ.సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. టీవీఎస్‌.రాజు, కంకిపాటి బుచ్చిబాబు, పిక్కిలి నాగేశ్వరరావు, నారాయణమూర్తి, ఎన్‌.శేషు, జల్లి శ్రీను, రమేష్‌ పాల్గొన్నారు.

Read more