-
-
Home » Andhra Pradesh » West Godavari » childrens d warming tablets need-MRGS-AndhraPradesh
-
చిన్నారులకు డీవార్మింగ్ మాత్రలు తప్పనిసరి: కలెక్టర్
ABN , First Publish Date - 2022-09-18T05:20:15+05:30 IST
పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్ మాత్రలు తప్పనిసరిగా వాడాలని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.

ఏలూరు కలెక్టరేట్, సెప్టెంబరు 17 : పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్ మాత్రలు తప్పనిసరిగా వాడాలని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం జాతీయ నులిపురుగుల నిర్మూలనపై ముద్రిం చిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఈనెల 21న నిర్వహించే ఈ కార్యక్రమంపై వైద్య, ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. నులిపురుగుల కారణంగా రక్తహీనత, బ్రెయిన్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని ముం దుగానే గుర్తించి, డీవార్మింగ్ మాత్రల ద్వారా నివారించగలిగితే పిల్లలు అనా రోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చునన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకూ డీ వార్మింగ్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. దీన్ని వందశాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎం హెచ్‌వో డాక్టర్ బి. రవి, డీసీహెచ్‌ఎస్ ఏవీఆర్ మోహన్, ఎన్‌సీడీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ మానస, డీఈవో గంగాభవాని, తదితరులు పాల్గొన్నారు.