మూడేళ్లుగా మూలనపడింది..

ABN , First Publish Date - 2022-02-19T05:42:33+05:30 IST

డిగ్రీ కళాశాల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేయడంతో 2019లో భవన నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి.

మూడేళ్లుగా మూలనపడింది..
అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం

బుట్టాయగూడెం, ఫిబ్రవరి 18: డిగ్రీ కళాశాల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేయడంతో 2019లో భవన నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు నిలిపి వేసింది. అసంపూర్తి భవనం మూడేళ్లుగా మూలన పడింది. ముప్పినవారి గూడెం రహదారిలో ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణ పనులను శ్లాబ్‌ వరకు పూర్తిచేశారు. రూ.50 లక్షల పనులు జరిగితే కాంట్రాక్టర్‌కు రూ.20 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. తర్వాత ప్రభుత్వం పనులు కొనసా గించాలని చెప్పడంతో అధికారులు కాంట్రాక్టర్‌ వెంటబడ్డారు. మిగిలిన సొమ్ము ఇచ్చే వరకు పనులు చేయలేనని కాంట్రాక్టర్‌ స్పష్టం చేయడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడేళ్లుగా ముందుకు సాగలేదు. దీనిపై ఏఈని వివరణ కోరగా నిధులు కొరత కారణమని, నిధులు వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామన్నారు.

Read more