బాలుడి కిడ్నాప్‌

ABN , First Publish Date - 2022-12-13T00:29:48+05:30 IST

ఏలూరు నగరంలో బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. తోటి పిల్లలతో ఆరు బయట ఆడుకుంటుం డగా ఎత్తుకెళ్లారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలివి. తంగెళ్లమూడి లక్ష్మీనగర్‌కు చెందిన రాజప్రోలు యశ్వంత్‌(10) అనే బాలుడు ఆదివారం మధ్యా హ్నం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా ఆడుకోవ డానికి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకు వెళ్తున్నట్టు స్థానికులు గుర్తించారు.

బాలుడి కిడ్నాప్‌

ఏలూరు రూరల్‌, డిసెంబరు 12: ఏలూరు నగరంలో బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. తోటి పిల్లలతో ఆరు బయట ఆడుకుంటుం డగా ఎత్తుకెళ్లారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలివి. తంగెళ్లమూడి లక్ష్మీనగర్‌కు చెందిన రాజప్రోలు యశ్వంత్‌(10) అనే బాలుడు ఆదివారం మధ్యా హ్నం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా ఆడుకోవ డానికి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకు వెళ్తున్నట్టు స్థానికులు గుర్తించారు. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈలోగా ఓ వ్యక్తి మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం. మూడు లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని ఫోన్‌ చేసి బెదిరించారు. ఏలూరు మార్కెట్‌ యార్డులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి రమేష్‌ తన వద్ద అంత డబ్బులేదని తమ బిడ్డను వదిలి పెట్టాలని ప్రాధేయపడ్డాడు. వారు ఒప్పుకోకపోవడంతో చివరకు సోమవారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Updated Date - 2022-12-13T00:29:48+05:30 IST

Read more