చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి: బొరగం శ్రీనివాసులు

ABN , First Publish Date - 2022-09-26T02:02:32+05:30 IST

వేలేరుపాడు మండలం తిరుమలపురం గ్రామాల్లో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. వైసీపీ

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి: బొరగం శ్రీనివాసులు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): వేలేరుపాడు మండలం తిరుమలపురం గ్రామాల్లో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కరపత్రాలను పంచారు. నిత్యావసరాలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, కరెంట్ ఆర్టీసీ చార్జీల పెంపు, మద్యపాన నిషేధం, నాసిరకం మద్యం వంటి అంశాలను ఈ కరపత్రాల్లో పేర్కొన్నారు.


ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, అభివృద్ది కుంటుపడిందని, సంక్షేమ పథకాలు పేరుతో అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా తమ ప్రాంత ప్రజలను గోదావరికి బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  


కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పోలవరం మండల పార్టీ అధ్యక్షుడు అమలవరపు అశోక్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గొంది నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి శాఖమూరి సంజీవులు, ఐటిడిపి మండల అధ్యక్షులు ఎండి నకిమ్, మండల ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, ఐటిడిపి పంచాయతీ అధ్యక్షులు తాటి మల్లేష్, కురమేళ్ళ సుధాకర్ , అమరవరపు వెంకన్న,గోపు పెంటారావు, చందా కనకారావు, కొటారి రామ్, రామారావు,అనిల్ సలీం, సూరి, వెంకన్న బాబు, కన్నయ్య, దుర్గారావు, మిరియాల ముక్కయ్య, మిర్యాల దుర్గారావు, తాటి హనుమంతరావు, పొట్ల వీరబ్రహ్మం, తాటి చినబాబు, కోటిపల్లి సంతోష్ కుమార్, సిహెచ్ పోసి తదితరులు పాల్గొన్నారు.


Read more