నాడు–నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-09-08T05:51:34+05:30 IST

నాడు–నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అబ్జర్వర్‌ పి.సుశీల అన్నారు.

నాడు–నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ అబ్జర్వర్‌ సుశీల

భీమవరం, సెప్టెంబరు 7 : నాడు–నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అబ్జర్వర్‌ పి.సుశీల అన్నారు. బుధవారం జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్‌  కళాశాలల ప్రిన్సిపాల్స్‌, లెక్చలర్‌లకు డీఎన్‌ఆర్‌ కళాశాలలో మనబడి, నాడు–నేడుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో కళాశాలలో 15 శాతం రివాల్వింగ్‌ఫండ్‌ జమ అయిన కారణంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఎనిమిది కాంపోనెంట్స్‌ సంబంధించి పలు రకాల మెటీరియల్‌ను ఏవిఽ దంగా సేకరించాలో తెలిపారు. ఎస్‌టీఈఎం సాఫ్ట్‌వేర్‌లో బిల్లులను అప్‌లోడ్‌ చేసే విధానాన్ని తెలియచేస్తూ పలు అంశాలపై చర్చించారు. డీఈఈ బీహెచ్‌ రావు, డీవైఈవో వి.శ్రీనివాసరావు, ఆర్‌ఐవో కె.చంద్రశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read more