చిరంజీవి అభిమానుల రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2022-08-22T04:43:58+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు.

చిరంజీవి అభిమానుల రక్తదాన శిబిరం
నరసాపురంలో రక్తదానం చేస్తున్న చిరంజీవి అభిమానులు

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 21: మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. చిరంజీవి యువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 20 మంది రక్తదానం చేశారు. 57 మార్లు రక్తదానం చేసిన వీరా భాస్కరరావును అభినందిస్తూ హైదరాబాద్‌ నుంచి రామ్‌చరణ్‌ పంపిన మెమోంటో రామలింగేశ్వరరావు అందజేశారు.


నరసాపురం: చిరంజీవి అభిమానులు 50 మంది రక్తదానం చేశారు. చిరం జీవి అసోసియేషన్‌ అధ్వర్యంలో శిబిరాన్ని జనసేన నాయకులు చాగంటి మురళి ప్రారంభించారు. నరసాపురం రెడ్‌క్రాస్‌ రక్తాన్ని సేకరించింది. చిట్టవరంలో అంజనా పుత్ర యువ సేనా ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసరాలందించారు. కోపల్లి శ్రీను, దివి సత్యన్‌, చెన్నంశెట్టి నాగు, డి.శ్రీనివాస్‌, గుగ్గిలపు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Read more