-
-
Home » Andhra Pradesh » West Godavari » bjp rally against ycp ruling-MRGS-AndhraPradesh
-
వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
ABN , First Publish Date - 2022-09-20T05:24:25+05:30 IST
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ పిలుపునిచ్చారు.

తాడేపల్లిగూడెం రూరల్, సెప్టెంబరు 19: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ పిలుపునిచ్చారు. వానపల్లిగూడెంలో ప్రజా పోరు యాత్రను సోమవారం ఆయన ప్రారంభిం చారు. జగన్ ప్రభుత్వ అభివృద్ధి నిరోధక పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరు బాట సభలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గట్టిం మాణిక్యాలరావు, కోట రాంబాబు, పట్టణ అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.
నరసాపురంలో బీజేపీ ప్రజాపోరు యాత్ర..
నరసాపురం: వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అవినీతి, అసమర్ధ పాలనపై పోరాటానికి బీజెపీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ పిలుపు నిచ్చారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో సోమవారం రాత్రి బీజేపీ ప్రజా పోరుయాత్రలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం మూ డేళ్లలో పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబ డిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజా పోరు యాత్ర సాగుతుందన్నారు. ఉన్నమట్ల కబర్ధి, ఎ.శ్రీదేవి, కంచర్ల నాగేశ్వరరావు, గునిశెట్టి శ్రీను, మునికోట వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
–––––––––––––––––––––––––––
