కేంద్ర నిధులు వాడుకుని రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్నారు

ABN , First Publish Date - 2022-09-21T06:01:28+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా అవినీతిమయమైందని ఎమ్మెల్యేలు, ఎంపీ లు లిక్కర్‌, మట్టి, ఇసుక, ల్యాండ్‌ మాఫియాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

కేంద్ర నిధులు వాడుకుని రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్నారు
విలేకరులతో మాట్లాడుతున్న సోము వీర్రాజు, చిత్రంలో తపనా చౌదరి తదితరులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు


ఏలూరు టూ టౌన్‌, సెప్టెంబరు 20 : రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా అవినీతిమయమైందని ఎమ్మెల్యేలు, ఎంపీ లు లిక్కర్‌, మట్టి, ఇసుక, ల్యాండ్‌ మాఫియాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన ఏలూరులో విలేకరు లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ముఖ్యమంత్రి జగన్‌ నవరత్నాలకు ఖర్చుపెట్టి రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాడన్నారు. ఉపాధి హామీ నిధులు రూ.70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిం దన్నారు. పేదలకు ఇళ్ళు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి లక్షా 80 వేలు ఇస్తుంటే ఇళ్లు నిర్మించడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని అన్నారు. రాష్ర్టానికి కేంద్రం 10 లక్షలు ఇళ్ళు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టించలేకపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచ్‌లకు తిరిగి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఇంత వరకు లబ్ధిదా రులకు ఎందుకు ఇవ్వలేదన్నారు. ఏపీలో అభివృద్ధి శూన్యమన్నారు. రోడ్డు కూడా వెయ్యలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. గతంలో ప్రైవేటు వ్యక్తులు దొంగ సారా కాసేవారని ఇప్పుడు ప్రభుత్వమే దొంగసారా కాసి దాన్నే మద్యం షాపుల్లో రకరకాల బ్రాండ్లతో విక్రయి స్తోందని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు కే.సుధాకర్‌ కృష్ణ, తపనా చౌదరి, మండల అధ్యక్షుడు బాడిత నారాయణ రావు, లాక్కొజు అనిల్‌ ఆచార్య, పి.ముకేష్‌, కాట్రు విజయ్‌, నడపన ధాన భాస్కర్‌, నుదురుపాటి కృష్ణచైతన్యశర్మ, తదితరులు పాల్గొన్నారు. 


Read more