బీసీలు రాజకీయ, ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-08-22T05:17:39+05:30 IST

రాష్ట్రంలో బీసీలు రాజకీయ, ఆర్థికంగా ఎదగాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు లక్కోజు రాజగోపాలాచారి అన్నారు.

బీసీలు రాజకీయ, ఆర్థికంగా ఎదగాలి

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 21 : రాష్ట్రంలో బీసీలు రాజకీయ, ఆర్థికంగా ఎదగాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు లక్కోజు రాజగోపాలాచారి అన్నారు. ఆదివారం స్థానిక మెయిన్‌బజార్‌లోని బ్రహ్మానందం కాంప్లెక్స్‌లో సంఘ సమావేశం నిర్వహించారు. నగరంలో బీసీలు సమస్యలపై చర్చించారు. కొన్ని కుల వృత్తులు కార్పొరేట్‌ సంస్థల వల్ల ఇబ్బందులకు గురవుతున్నాయని, బీసీ సంచార జాతుల్లో కొన్ని కులాలకు ఇప్పటికీ ప్రాతినిధ్యం లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వీటిపై చర్చించారు. త్వరలో మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలిసి సమస్యల పరిష్కారంపై వినతిపత్రం అందజేసేందుకు తీర్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఏలూరు డివిజన్‌లో సంఘం కార్యవర్గాన్ని విస్తరిస్తామన్నారు. జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ, బీసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీఆర్‌ విఠల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఏసురాజు, మలిపూడి రాజు, వై.నాగ, యువజన నాయకులు జరజాపు రఘు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-22T05:17:39+05:30 IST