హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం

ABN , First Publish Date - 2022-12-12T00:08:29+05:30 IST

హక్కుల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా పోరాటం చేయాలని ఆ సంఘం నాయకు లు పిలుపునిచ్చారు.

హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం
మాట్లాడుతున్న పాకా సత్యనారాయణ

నరసాపురం టౌన్‌, డి సెంబరు 11: హక్కుల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా పోరాటం చేయాలని ఆ సంఘం నాయకు లు పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ భవనంలో ఆదివారం నిర్వహించిన బీసీ ఐక్య వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పాకా సత్యనారాయణ, వేండ్ర వెంకటస్వామి, కె.నర్సింహారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధానం గా సమగ్ర కుల గణన, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై చర్చించారు. బీసీలు వెనుకబాటుతనానికి అర్ధిక, విద్య లేకపోవడమేనన్నారు. రానున్న రోజుల్లో కులగణన, రిజర్వేషన్లపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూ ఎస్‌ రిజర్వేషన్‌ వల్ల బీసీలు పదిశాతం రిజర్వేషన్‌ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గాడి నెహ్రు, బొమ్మిడి నాయకర్‌, కామన బుజ్జీ, పురెళ్ళ శ్రీనివాస్‌, గుబ్బల నాగరాజు, కొప్పాడ రవి, వీరవల్లి శ్రీనివాస్‌, కె.యుగంధర్‌, షేక్‌ హుసేన్‌, జె.లోకేష్‌, బర్రె శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:08:29+05:30 IST

Read more