టీడీపీ కార్యకర్తలపై...దాడులు సహించం

ABN , First Publish Date - 2022-09-25T06:00:22+05:30 IST

జగన్‌ పాలనలో టీడీపీ కార్యకర్తలపై దాడులు సహించబోమని, రానున్న ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 35 సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌చార్జి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలపై...దాడులు సహించం
సమీక్షలో పాల్గొన్న పుల్లారావు, ఇతర నేతలు

ఉభయ గోదావరి జిల్లాల్లో 35 సీట్లు మావే
 పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


భీమవరం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో టీడీపీ కార్యకర్తలపై దాడులు సహించబోమని, రానున్న ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 35 సీట్లు గెలుచుకుంటామని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌చార్జి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చా ర్జిలతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వ హించారు. జిల్లా అధ్యక్షురాలు తోట సీతా రామలక్ష్మి నేతృత్వంలో జరిగింది. ఇందులో పార్టీ సంస్థాగ తంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తీర్మానించారు. బాదుడే బాదుడే కార్యక్ర మాన్ని అన్ని నియోజకవర్గాల్లోనూ సంపూ ర్ణంగా పూర్తి చేయాలని ప్రత్తిపాటి దిశానిర్దేశం చేశారు. అధిష్ఠానం ఇచ్చిన లక్ష్యాలకు అనుగు ణంగా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రి య పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సమీక్ష వివరాలను విలేఖరులకు వెల్లడించారు. ప్రధా నంగా సభ్యత్వ నమోదు, ఓటరు పరిశీలన, వైసీపీ కుతంత్రాలు, బాదుడే బాదుడు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై చర్చించామని తెలిపారు.

 అమరావతికే టీడీపీ మద్దతు

గతంలో నిర్ణయించిన మేరకు రాష్ట్ర రాజధానిగా అమరావతికే తమ పార్టీ మద్దతు ఇస్తుందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి పితాని సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. రైతులు నిర్వహించే మహా పాదయాత్రకు జిల్లాలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. పాదయాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు.

పశ్చిమలో ఘనమైన ఆతిథ్యం

 రాజధాని కోసం పోరాడుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు పశ్చిమలో ఘనమైన ఆతిథ్యం ఇస్తామని ఎంఎల్‌ఏ నిమ్మల రామానా యుడు  తెలిపారు. అమరావతి కేవలం 29 గ్రామాల ప్రజలదే కాదని, ఐదు కోట్ల మంది అంధ్రులదని వివరించారు.  పాదయాత్రకు మద్దతు ప్రకటించి పశ్చిమ రైతుల సత్తా ఏంటో జగన్‌మోహన్‌ రెడ్డికి  చూపిస్తామని అన్నారు.

అందరి రాజధాని... అమరావతే

 అమరావతి... రాష్ట్ర పజలందరిదని ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. మహా పాదయాత్రకు జిల్లా పెద్దలు, రైతులు సహకరించాని కోరారు. దళిత రాజధాని అయిన అమరావతిని కాపాడుకుంటామని రాజ మండ్రి పార్లమెంటరీ అధ్యక్షుడు కె.ఎస్‌.జవహర్‌ అన్నారు. దళితులంతా జిల్లాలో పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్‌రెడ్డికి ఒక్క ఛాన్స్‌ ఇచ్చి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని నర్సాపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. ఎంఎల్‌సీ అంగర్‌ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ సీఎం  మానసిక పరిస్థితి బాగోలేదంటూ ఎద్దేవా చేశారు. సమీక్షలో ఎంఎల్‌ఏ రామరాజు,  మాజీ ఎంఎల్‌ఏలు చింతమనేని ప్రభాకర్‌, వేటుకూరి శివరామరాజు,  ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీమంత్రి పీతల సుజాత, నియోజకవర్గ  ఇన్‌చార్జులు వలవల బాబ్జీ, పొత్తూరి రామరాజు, బడేటి రాధాకృష్ణ, బొరగం శ్రీనివాసరావు,  రాష్ట్ర కోశాధికారి మెంటే పార్దసారథి, కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, నాయకులు పాలి ప్రసాద్‌, పిచ్చేటి వెంకట నరసింహరావు, సీలం వెంకటేశ్వరరావు, దాసరి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T06:00:22+05:30 IST