-
-
Home » Andhra Pradesh » West Godavari » anti drugs awareness-MRGS-AndhraPradesh
-
మత్తు పదార్థాల వినియోగంతో జీవితం నాశనం
ABN , First Publish Date - 2022-09-09T05:18:50+05:30 IST
మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనమవుతాయని ఎస్‌ఈబీ సీఐ వీవీవీఎస్‌ఎన్ వర్మ అన్నారు.

భీమవరం టౌన్, సెప్టెంబరు 8: మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనమవుతాయని ఎస్‌ఈబీ సీఐ వీవీవీఎస్‌ఎన్ వర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కేజీఆర్‌ఎల్ బిఫార్మసీ విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల అనర్ధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల డ్రగ్స్ కేసుల నమోదు ఆందోళనకరమన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.రాఘ వ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నరహరిశెట్టి కృష్ణ, తదిరులు పాల్గొన్నారు.