ఆ భవనాలు సద్వినియోగం చేయండి

ABN , First Publish Date - 2022-06-07T06:45:39+05:30 IST

మండలంలో నిరుపయోగంగా ఉన్న వీఆర్వో కార్యాలయ భవనాలను అవసరమైన శాఖలకు అప్పగించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మిని, చాట్రాయి తహసీల్దార్‌ విశ్వనాథరావును ఆదేశించారు.

ఆ భవనాలు సద్వినియోగం చేయండి

అధికారులకు జేసీ ఆదేశం  

 ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

చాట్రాయి, జూన్‌ 6: మండలంలో నిరుపయోగంగా ఉన్న వీఆర్వో కార్యాలయ భవనాలను అవసరమైన శాఖలకు అప్పగించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మిని, చాట్రాయి తహసీల్దార్‌ విశ్వనాథరావును ఆదేశించారు. జూన్‌ 4న ఆంధ్రజ్యోతిలో ‘ప్రజాధనం వృథా’ శీర్షికన నిరుపయోగంగా ఉన్న వీఆర్వో కార్యాలయ భవనాలపై ప్రచురితమైన కథనానికి జేసీ స్పందించి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. త్వరలో ఆర్డీవో, తహసీల్దార్‌ ఇతర అధికారులు నిరుపయోగ వీఆర్వో భవనాలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.

Read more