ఏపీ పరిరక్షణ కోసమే.. రైతుల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-28T06:11:19+05:30 IST

ఏపీ పరిరక్షణ కోసమే.. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని... రాజధాని ఉంటేనే ఏ రాష్ట్రం అయినా.. ముందుకు వెళు తుందని ఏపీ రైతు సంఘాల సమీక్ష అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాఽథ్‌ తెలిపారు.

ఏపీ పరిరక్షణ కోసమే.. రైతుల పాదయాత్ర
డీవీవీఎస్‌ వర్మ, మనోరమ దంపతులను సత్కరిస్తున్న దృశ్యం

 రైతు సంఘాల సమీక్షలో అధ్యక్షుడు నాగేంద్రనాథ్‌

భీమవరం అర్బన్‌, సెప్టెంబరు 27: ఏపీ పరిరక్షణ కోసమే.. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని... రాజధాని ఉంటేనే ఏ రాష్ట్రం అయినా.. ముందుకు వెళు తుందని ఏపీ రైతు సంఘాల సమీక్ష అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాఽథ్‌ తెలిపారు. భీమవరం ఆనంద్‌ ఇన్‌లో అఖిల భారత్‌ కిసాన్‌ సభ, రాష్ట్ర రైతు మహాసభలు మంగళవారం ప్రారంభించారు. ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుంచి రైతు నాయకులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన నాగేంద్రనాఽథ్‌ మాట్లాడుతూ అమరావతి రైతులు ఏపీ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డీవీవీఎస్‌ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. టీడీపీ జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి తమ్మినీడి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఉండటం దారుణమన్నారు. ముందుగా రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రైతు సం ఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ కార్యదర్శి జ్యోతిరంజన్‌ మహపత్ర, ఆల్‌ ఇండియా అగ్రగామి కిసాన్‌ సభ జాతీయ కార్యదర్శి పి.సుందరరామరాజు, బోస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అల్లూరి అచ్యుతరామరాజు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, దండు శ్రీనివాసరాజు, నల్లం నాగేశ్వరరావు, తదితర రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Read more