విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి

ABN , First Publish Date - 2022-07-05T05:38:03+05:30 IST

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సోమవారం జిల్లాలో పలుచోట్ల ఘనంగా నివాళులర్పించారు.

విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి
మోగల్లులో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివ నివాళి

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌ : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సోమవారం జిల్లాలో పలుచోట్ల ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్‌వారిని గడగడలాడించిన అల్లూరి నడయాడిన మోగల్లులో ధ్యాన కేంద్రంతో పాటు ఆర్చరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు అన్నారు. మో గల్లులో అల్లూరి విగ్రహం వద్ద సోమవారం ఉదయాన్నే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పిం చారు. మోగల్లు గ్రామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని తీసుకురావడానికి ప్రయత్నించామని, రహదారులు ఇరుకు గా ఉండడం వలన సాధ్యపడలేదన్నారు. మోగల్లు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం మోగల్లులో నిర్మిస్తున్న ధ్యానకేంద్రం పనులను, చెరువు గట్టుపై నున్న అల్లూరి విగ్రహంవద్ద ఏర్పాటుచేసిన అల్లూరి చరిత్ర కలిగిన ప్లెక్సీలను పరిశీలించారు. సర్పంచ్‌ మల్లిపూడి కృష్ణకుమారి శ్రీనివాస్‌, దెందుకూరి కోటేశ్వరరాజు, సంకురుడు, శివరామరాజు, బాపిరాజు, గాదిరాజు శ్రీని వాసరాజు, శ్రీనివాస్‌, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలం కొత్త పూసలమర్రులో అల్లూరి విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి పోరాట పటిమ, దేశభక్తి నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు. సీపీఐ భీమవరం ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, మామిడిశెట్టి లక్ష్మీపతి, తిరుమాని కామేశ్వరావు, వాటాల రాథాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు లో టీడీపీ నేతలు మోటుపల్లి రామవరప్రసాద్‌, బొల్లా వెంకట్రావు నివాళులర్పించారు. పోరాట యోధుడు అల్లూరి త్యాగం మరువలేనిదని ఏఎంసీ చైర్మన్‌ ఎండీ మస్తాన్‌ వలీ, నగర పంచాయతీ చైర్మన్‌ జామి హైమావతి అన్నారు. ఆకివీడు మండలం సిద్ధాపురంలో వైద్యులు  ప్రతాప్‌ కుమార్‌, మహేష్‌వర్మ, కృష్ణంరాజు నివాళులర్పించారు. 120 మంది పేద వృద్ధులకు దాతల సహకారంతో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అయి భీమవరం, ఉప్పుటేరు వద్ద ఉన్న కాటన్‌ పార్కులో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసిఘనంగా నివాళలర్పించారు. సర్పంచ్‌ చిట్టిబాబు, కొల్లేరు రైతు నాయకుడు భూపతిరాజు తిమ్మరాజు, బొల్లా వెంకట్రావు, నౌకట్ల రామారావు, గొంట్లా గణపతి, మద్దా నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఉణుదుర్రులో సీతారామరాజు విగ్రహానికి సర్పంచ్‌ పిన్నంరాజు నాగలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. గొర్రెముచ్చుల సుందరకుమా ర్‌, మహిళలు, పెద్దలు పాల్గొన్నారు. చెరుకువాడ, మహదేవ పట్నంలో పలువురు నివాళులర్పించారు. యండగండి గ్రంథాలయంలో గ్రంధాలయ పాలకుడు ఎన్‌సిహెచ్‌ రామకృష్ణ, పీవీఏఎస్‌ గోపాలకృష్ణంరాజు, వేగేశ్న సత్తిరాజు, రుద్రరాజు పద్మనాభసాయిరాజు తదితరలు పాల్గొన్నారు. దేశభక్తి, సాహసానికి మారుపేరు అల్లూరి సీతారామరాజు అని వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకిరామ్‌ అన్నారు. వర్సిటీలో అల్లూరి చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. రిజిస్ట్రార్‌ కె.గోపాల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జనసేన యు వనేత బొలిశెట్టి రాజేష్‌ అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌ అల్లూరి విగ్రహానికి  పూల మాలవేసి నివాళులర్పించారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి మండలంలోని నేరేడుమిల్లి, చించినాడ, కలగంపూడి తదితర గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, గ్రామస్థులు స్వాతంత్ర సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచంట మండలంలోని పలు పాఠశాలల్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకగా నిర్వహించారు. ఆచంట శివారు పోర పాఠశాల, కొడమంచిలి శివారు బండి వారిపాలెం పా ఠశాలల్లో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హెచ్‌ ఎంలు త్రిమూర్తులు, నరేష్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌లు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. మొగల్తూరు మండలంలో అల్లూరి జయంతి కార్యక్రమాల్లో వైస్‌ ఎంపీపీ కైలా సుబ్బారావు, కొండా ఆదాము, తదితరులు పాల్గొన్నారు. జగన్నాధపురం, ముత్యాలపల్లి గ్రామాల్లో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. నరసాపురం మండలం సీతారాంపురం హైస్కూ ల్‌లో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహాన్ని హాస్యనటుడు గౌతంరాజు, అల్లూరి మనవడు శ్రీరామరాజులతో కలిసి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కంబాల హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం, గ్రంథాలయశాఖ అధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ సోని, వీసీ రమేష్‌నాయుడు, సర్పంచ్‌ వెంకట్‌, రాజ్యలక్ష్మి, కుమారి, సుదీర్‌మోహన్‌, కవురు పెద్దిరాజు, ఎం త్రిమూర్తులు, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.

నరసాపురం పట్టణంలోని టేలర్‌ హైస్కూల్‌ మైదానంలో అల్లూరి విగ్రహా నికి టీడీపీ నేత పొత్తూరి రామరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, తదితరులు పాల్గొ న్నారు. మహిళా కళాశాల అధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.  కార్య క్రమంలో ప్రిన్సిపాల్‌ నీరజ, అధ్యాపకులు పాల్గొన్నారు. తణుకు వీర నారాయణ సెంటర్‌లో అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి  పూల మాలలు వేసి నివాళి అర్పించారు. తేతలిలో క్షత్రియ యువత విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. భూపతిరాజు శ్రీనివాసరాజు, మందపాటి శివరామరాజు, విజయరామరాజు, పాల్గొన్నారు. సీపీఎం నేత పీవీ ప్రతాప్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. తాడేపల్లిగూడెం బస్టాండ్‌ వద్ద అల్లూరి విగ్రహానికి రంగస్థల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడేపల్లి మోహన్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు.



Updated Date - 2022-07-05T05:38:03+05:30 IST