-
-
Home » Andhra Pradesh » West Godavari » agriculture officer visit-NGTS-AndhraPradesh
-
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ABN , First Publish Date - 2022-09-08T05:38:15+05:30 IST
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏవో) జడ్.వెంకటేశ్వరరావు అన్నారు.

పెంటపాడు, సెప్టెంబరు 7: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏవో) జడ్.వెంకటేశ్వరరావు అన్నారు. ఆకుతీగపాడులో ఏవో కె.పార్థసారధి ఆధ్వర్యంలో బుధవారం పొలంబడి నిర్వహించారు. సర్పంచ్ దాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఏవో మాట్లాడుతూ రైతులు అవసరం మేరకే పురుగుమందులు వాడాలని, మిత్ర పురుగులను రక్షించుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కైగాల శ్రీనివాస్, ఏవో పార్థసారథి, మాజీ సర్పంచ్ ధనరాజు పాల్గొన్నారు.
పథకాలు రైతులకు అందేలా చూడాలి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా ఆర్బీకే సబ్బంది పనిచేయాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వ రరావు సూచించారు. కృష్ణాయపాలెం ఆర్బీకేని బుధవారం ఆయన పరి శీలించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. మండల వ్యవసాయాధికారి ఆర్‌ఎస్ ప్రసాద్, ఆర్బీకే ఇన్‌చార్జ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.