సచివాలయ సిబ్బంది నిర్బంధం

ABN , First Publish Date - 2022-09-28T06:00:30+05:30 IST

గోదావరి వరదలకు నష్టపోయిన ఇళ్లకు సంబంధించి పరిహారం అందలేదంటూ అమరవరం పంచాయతీ ఎలకల గూడెం గ్రామస్థులు సచివాలయ సిబ్బందిని కార్యాలయంలో నిర్బంధించారు.

సచివాలయ సిబ్బంది నిర్బంధం
సచివాలయ సిబ్బందిని నిర్బంధించి బైఠాయించిన బాధితులు

ఇళ్ల నష్టపరిహారం చెల్లించాలంటూ అమరవరంలో ఆందోళన

కుక్కునూరు, సెప్టెంబరు 27 : గోదావరి వరదలకు నష్టపోయిన ఇళ్లకు సంబంధించి పరిహారం అందలేదంటూ అమరవరం పంచాయతీ ఎలకల గూడెం గ్రామస్థులు సచివాలయ సిబ్బందిని కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో  వందలాది ఇళ్లు వరద ముంపునకు గురై ప్రజలు నష్టపో యారు. కొంతమందికి మాత్రమే నష్టపరిహారం అందింది. మిగిలినవారికి అందక పోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. సచివాలయ సిబ్బందిని  కార్యాల యంలో ఉంచి బయట తాళం వేశారు. కార్యాలయ ఆవరణలోనే బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ  నినాదాలు  చేశారు. విషయం తెలిసిన  వెంటనే ఎంపీడీవో  శ్రీనివాస్‌, తహసీల్దార్‌  భద్రయ్య, ఎస్‌ఐ శ్రీని వాస్‌లు సచివాలయానికి చేరుకున్నారు.  నష్టపోయిన వారందరినీ  గుర్తించి  జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పరిహారం అందజేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Read more