కంటైనర్‌ లారీ ఢీకొని.. వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-03-04T05:48:06+05:30 IST

కంటైనర్‌ లారీ ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు.

కంటైనర్‌ లారీ ఢీకొని.. వృద్ధుడి మృతి

కాళ్ళ, మార్చి 3 : కంటైనర్‌ లారీ ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు.  ఉండి మండలం మహాదేవపట్నం గ్రామానికి చెందిన కంకిపాటి ప్రాన్సిస్‌ (62) భీమవరం వైపు నుంచి వెళ్తుండగా కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామం వద్ద బుధవారం రాత్రి కంటైనర్‌ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది.   దీంతో ఫ్రాన్సిస్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు బాలస్వామి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్టు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

Read more