యశ్వంత్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-09-08T05:50:14+05:30 IST

నరసాపురం నుంచి శుక్ర, ఆదివారాల్లో యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌)కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు భీమవరం సెక్షన్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, డీఆర్‌సీసీ మెంబర్‌ జక్కంపూడి కుమార్‌ తెలిపారు.

యశ్వంత్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లు

నరసాపురం/పాలకొల్లు, సెప్టెంబరు 7 : నరసాపురం నుంచి శుక్ర, ఆదివారాల్లో యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌)కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు భీమవరం సెక్షన్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, డీఆర్‌సీసీ మెంబర్‌ జక్కంపూడి కుమార్‌  తెలిపారు. 07513 నంబరుతో మధ్యాహ్నం 3.20కు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం  10.50 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుందన్నారు. తిరిగి అక్కడ 07514 నంబరుతో సాయంత్రం 4.06 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం చేరుకుంటుందన్నారు. ఆదివారం కూడా ఇదే షెడ్యూల్‌లో నడుస్తుందన్నారు. ఈ రైలు గుంటూరు, మార్కాపురం, అనంతపురం, ధర్మవరం, పెనుగొండ, హిందూపురం మీదుగా నడుస్తుందన్నారు. జిల్లాలో పాలకొల్లు, భీమవరం టౌన్‌,  ఆకివీడు స్టేషన్లలో మాత్రమే ఆగుతుందన్నారు

Read more