-
-
Home » Andhra Pradesh » West Godavari » 5 daYS training to lecturers in ap nit-NGTS-AndhraPradesh
-
చిప్‌లలో నానో సాంకేతికత
ABN , First Publish Date - 2022-03-16T06:44:35+05:30 IST
ఎలక్ర్టానిక్ చిప్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నానో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడు తుందని ఏపీ నిట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాశ్ రావు తెలిపారు.

తాడేపల్లిగూడెం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్ చిప్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నానో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడు తుందని ఏపీ నిట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాశ్ రావు తెలిపారు. ఏపీ నిట్ ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూని కేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్యర్యం లో అధ్యాపకు లకు ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. వర్చువల్ విధానంలో అధ్యాపకుల నుద్ధేశించి మాట్లాడారు. నానో సాంకేతికను ప్రయోగించి ఎలక్ర్టానిక్ చిప్ తయారీ, పనితీరు మెరుగు పరచే అంశాలపై ఆయన వివరించారు. గృహోపకరణాలు, ఆరోగ్య పరికరాలు, రక్షణ, పరిశ్రమల ఉత్పత్తుల్లోనూ నానో సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఖరగ్‌పూర్, గౌహతి, చెన్నయ్ ఐఐటీ ఆచార్యులు డాక్టర్ ప్రసన్న సాహో, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ కె.లక్ష్మీ గణపతి, రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఆచార్యులు డాక్టర్ విపిన్ ఆమోలి తదితరులు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.