చేతకాదంటే పోలవరం మేమే నిర్మిస్తాం: సోము

ABN , First Publish Date - 2022-09-21T09:11:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మించడం చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వమే నిర్మాణ పనులు చేపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏలూరులో అన్నారు. కాంట్రాక్టర్లను మార్చి రాష్ట్ర

చేతకాదంటే పోలవరం మేమే నిర్మిస్తాం: సోము

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 20: రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మించడం చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వమే నిర్మాణ పనులు చేపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏలూరులో అన్నారు. కాంట్రాక్టర్లను మార్చి రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లు దండుకుంటోందన్నారు. పోలవరం నిర్వాసితులను ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం గుర్తించనే లేదని నిర్వాసితులకు డబ్బులు ఇమ్మంటే ఎలా ఇస్తామన్నారు. పోలవరం నిర్వాసితులు శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోనే కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, జనంతోనే బీజేపీ పొత్తని అన్నారు.

Read more