పేరు చివర తోకలను తీసేస్తున్నాం

ABN , First Publish Date - 2022-07-07T08:00:16+05:30 IST

పేరు చివర తోకలను తీసేస్తున్నాం

పేరు చివర తోకలను తీసేస్తున్నాం

దీనిపై చట్టం కూడా తేవాలి: ఆదినారాయణరెడ్డి

ఆదోని టౌన్‌, జూలై 6: పేర్ల చివర ఆ తోకలెందుకని దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు ఎప్పుడో ప్రశ్నించా రు. ఈ తోకలను తీసేసేలా చట్టం తేవాలని కోరుతూనే.. తా ము కూడా తమ పేర్ల చివర ‘రెడ్డి’ పదాన్ని తొలగించుకుంటున్నామని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రాయలసీమ పశ్చిమ ప్రాంతాల అభివృద్ధి వేదిక సారఽథి, వ్యాపారవేత్త ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. కర్నూలు జిల్లా పెద్దహరివాణంలో బుధవారం మాట్లాడుతూ రెడ్ల కనుసన్నల్లోనే అన్నీ జరుగుతాయని, వారు తలుచుకొంటే ఏదైనా చేస్తారనే భావ న ప్రస్తుత సమాజంలో ఏర్పడిందన్నారు. రెడ్లపై కమ్ముకొంటున్న నీలినీడలకు సిగ్గు పడుతూ.. తమ కుటుంబ సభ్యుల పేర్లలోని రెడ్డి పదాన్ని శాశ్వతంగా తొలగిస్తున్నామన్నారు.

Read more