-
-
Home » Andhra Pradesh » We are conducting a survey on encroachment of water resources-NGTS-AndhraPradesh
-
నీటివనరుల ఆక్రమణపై సర్వే చేస్తున్నాం
ABN , First Publish Date - 2022-08-17T10:13:19+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా నీటివనరులు, చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు.

వివరాలు కోర్టు ముందుంచేందుకు సమయమివ్వండి
హైకోర్టును కోరిన ఏజీ
అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా నీటివనరులు, చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. నీటివనరుల ఆక్రమణలపై ఉత్తర్వులు జారీచేసే నిమిత్తం హైకోర్టు సుమోటో పిల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.