AP News: అంగన్ వాడీ, ఆశావర్కర్లకు వేతనాలు పెంచాలి : గఫూర్

ABN , First Publish Date - 2022-09-14T02:30:09+05:30 IST

Vijayawada: తమకు వేతనాలు పెంచాలని అంగన్ వాడీ, ఆశావర్కర్లు విజయవాడలో ధర్నా చేశారు. వీరికి వివిధ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు గఫూర్ (Gaffor) మాట్లాడుతూ.. ‘‘కార్మికుల హక్కులను కాలరాసేలా జగన్ (CM Jagan) ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ఎన్నికల ముందు హామీల వరాలు కురిపించిన జగన్.. అమలు చేయకుండా మోసం

AP News: అంగన్ వాడీ, ఆశావర్కర్లకు వేతనాలు పెంచాలి : గఫూర్

Vijayawada: తమకు వేతనాలు పెంచాలని అంగన్ వాడీ, ఆశావర్కర్లు విజయవాడలో ధర్నా చేశారు. వీరికి వివిధ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు గఫూర్ (Gaffor) మాట్లాడుతూ.. ‘‘కార్మికుల హక్కులను కాలరాసేలా జగన్ (CM Jagan) ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ఎన్నికల ముందు హామీల వరాలు కురిపించిన జగన్.. అమలు చేయకుండా మోసం చేశారు. జగన్ ప్రభుత్వంలో కార్మిక వర్గాలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్పినా.. ఏపీలో అమలు చేయడం లేదు. ప్రభత్వంపై భారం పడదని గణాంకాలతో తాము వివరించినా.. జగన్ చెవికెక్కించుకోవడం లేదు. తెలంగాణా కంటే ఎక్కువ వేతనాలు ఇస్తామన్న జగన్ మాట తప్పారు. పదివేలు ఇస్తున్నామన్న పేరుతో.. ప్రభుత్వ పథకాలకు కూడా దూరం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల ఖజానా నుంచి రూ. 1100 కోట్లు ఇతర  అవసరాలకు మళ్లించడం దుర్మార్గం. జగన్ బటన్ నొక్కుడు పేరుతో ఆర్భాటం చేయడం తప్ప.. హామీల అమలులో అందరికి మోసం చేశారు.’’ అని గఫూర్ విమర్శించారు. 

Read more