పార్వతీపురంలో యువజనోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-25T00:00:29+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా యువజనోత్సవాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు గురువారం ప్రారంభించారు.

పార్వతీపురంలో యువజనోత్సవాలు

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా యువజనోత్సవాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థుల జానపద నృత్యాలు, గీతలు, సంప్రదాయ గాత్ర, వాయిద్యా పోటీలు అలరించాయి. ఈసందర్భంగా సెట్విజ్‌ సీఈవో బి.రామానందం మాట్లాడు తూ జిల్లా స్థాయిలో విజేతలకు వచ్చేనెల 13వ నుంచి 15వ తేది వరకు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో, రాష్ట్రస్థాయిలో విజేతలు 2023 జనవరి 12వ 16వ తేది వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారని తెలిపారు. అనంతరం విజే తలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చలపతిరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:00:29+05:30 IST

Read more