బియ్యం ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-06-08T05:28:52+05:30 IST

తమకు బియ్యం ఎప్పుడిస్తారని కొదమ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కొదమలో తమ రేషన్‌ కార్డులు చూపుతూ.. నిరసన కార్యక్రమం చేపట్టారు.

బియ్యం ఎప్పుడిస్తారు?
కొదమలో బియ్యం ఇవ్వలేదని కార్డులు చూపుతున్న గిరిజనులు


 

   ప్రశ్నిస్తున్న కొదమ గిరిజనులు

  రేషన్‌ కార్డులతో నిరసన  

సాలూరు రూరల్‌, జూన్‌ 7: తమకు బియ్యం ఎప్పుడిస్తారని కొదమ గిరిజనులు  ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కొదమలో తమ రేషన్‌ కార్డులు చూపుతూ.. నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు ఐదు నెలలుగా రేషన్‌  ఇవ్వడం లేదని, ఎప్పుడిస్తారో అర్థం కావడం లేదని వారు తెలిపారు. కొండ శిఖర గ్రామమైన కొదమకే బియ్యం తెచ్చి ఇస్తామని అధికారులు చెప్పి నెల గడిచిందన్నారు. ఆఫ్‌లైన్‌లో రేషన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. గతంలో మాదిరిగా పార్వతీపురం ఎంఎల్‌ఎస్‌ నుంచి కొదమకే బియ్యం తెచ్చి పంపిణీ చేయాలన్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధి కారులు స్పందించాలని వారు కోరారు. గిరిజన యువతనేత చోడిపల్లి మాలతిదొర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో మాలతిదొర, మెల్లిక దిమ్మ, దెరుకు, చోడిపల్లి చంద్ర, రాజయ్య, సీదరపు రుప్ప తదితరులు పాల్గొన్నారు. 


Read more